దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ అల్బీ మోర్కెల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇకపై క్రికెట్‌ను మరో విధంగా ఆస్వాదిస్తానని చెప్పారు. అన్ని ఫార్మట్లకు అల్బీ గుడ్‌బై చెప్పేశారు. ఆల్‌రౌండర్‌గా దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ కేరీర్‌ను అల్బీ సాగించారు. మోర్కెల్ సౌతాఫ్రికా తరఫున 58 వన్డేలు, 50 టీ20లు, ఓ టెస్టులో ఆడాడు. ఈ ఆల్‌రౌండర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 77 వికెట్లు పడగొట్టగా, 1,412 పరుగులు చేశాడు. 2011 ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో మోర్కెల్ సభ్యుడు. తన సుధీర్ఘ కేరీర్‌ను ఎంతో ఆస్వాదించానని… కొన్ని స్వీట్ మెమోరీస్… కొన్ని చేదు జ్ఞాపకాలతో తన కేరీర్ కొనసాగిందని అల్బీ గుర్తు చేసుకున్నారు. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు