ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీరు-ప్రగతి సమీక్ష సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 01:07 AM

విజయవాడ, సూర్య బ్యూరో :  ప్రజల అండదండలు ఎప్పుడూ పనిచేసే ప్రభుత్వాలకుంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. `నీరు-ప్రగతి'పై సోమవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీపై ప్రజల విశ్వాసానికి ఇటీవల వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నిక ఫలితాలే నిదర్శనంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తు పట్ల ప్రజల ఆశలను 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయని వ్యాఖ్యానించారు. తనతో భేటి సందరేంగా నంద్యాల రోడ్ల అభివద్ది గురించి భూమా నాగిరెడ్డి ప్రస్తావించిన విషయం ఈ సందరేంగా సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఆళ్లగడ్డ, నంద్యాలలో రోడ్లు, తాగు, సాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కర్నూలు జిల్లాలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దష్టి పెట్టాలన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపునకు ఇంకా 15 రోజులే సమయం ఉందంటూ, నరేగా నిధులు పూర్తిగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పంటకుంటల తవ్వకం 2,66,729 పూర్తయ్యాయని, రోజుకు 500 తవ్వాలన్న లక్ష్యం చేరుకోవాలన్నారు. పనులు ప్రారంభించిన 4లక్షల పంట కుంటలు పూర్తిచేయడంపై శ్రద్ద పెట్టాలన్నారు. పంటకుంటల తవ్వకం, సోక్‌పిట్‌‌స తదితర అంశాలలో జలవనరుల శాఖ, నరేగా యంత్రాంగం సమన్వయంగా పని చేయాలన్నారు.  సిమెంటురోడ్ల నిర్మాణం 4,697 కి.మీ పూర్తయ్యిందని, టార్గెట్‌లో మిగిలిన 303 కి.మీ పనులు 15రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణం మందకొడిగా సాగడంపై అసంత ప్తి వ్యక్తంచేశారు. గ్రామ పంచాయితీ భవనాల నిర్మాణంలో చూపిన చురుకుదనం అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనుల్లో కూడా చూపాలన్నారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణంలో ఏమైనా ఆటంకాలుంటే గ్రామీణాభివద్ది, ఆర్ధిక, మహిళా సంక్షేమ శాఖలు సమన్వయంగా పనిచేసి వెంటనే పూర్తి చేయాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటివరకు 1,77,825 పూర్తిచేశారని, మిగిలినవి కూడా వేగవంతం చేయాలన్నారు. వర్మికంపోస్టు పిట్లు లక్ష పూర్తయ్యాయని, గ్రవుండ్గ అయినవాటిల్లో మిగిలినవి కూడా వెంటనే పూర్తిచేయాలన్నారు. ఎన్టీఆర్‌ హవుసింగ్‌ కింద పనులు ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. నరేగా కింద మౌలిక వసతులు(ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌) బాగా అభివ ద్ది చేసుకున్న గ్రామాలను ఆయా జిల్లాలలో మిగిలిన ప్రాంతాలవారు సందర్శించి అక్కడి నమూనాలను అధ్యయనం చేయాలన్నారు. క్షే్తస్థ్రాయి పర్యటనల వల్ల ఏమైనా అపోహలు ఉంటే తొలగిపోతాయన్నారు. ఫీల్‌‌డ విజిట్‌‌స వల్ల పంటకుంటల ప్రగతి, వర్మికంపోస్టు ప్రయోజనాలు తదితర అంశాలను అధ్యయనం చేయవచ్చన్నారు. ప్రజల కష్టాలు తీర్చే అవకాశం మనకు వచ్చిందని, దానిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామ సర్పంచులు, నరేగా సిబ్బంది మరింత బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. ``మనవల్ల గ్రామం బాగుపడుతుంది, ప్రజలు ఆనందంగా ఉంటారు'' అనేది అందరూ గుర్తించాలన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే గ్రామాలు బాగుపడవు, దానివల్ల ఇబ్బందులు పడేది ప్రజలేననేది గుర్తుంచుకుంటే ఎటువంటి పొరపాట్లు, లోపాలు జరగవన్నారు. బాధ్యత నిర్వహణలో పర్మినెంట్‌, టెంపరరీ ఉద్యోగులనే తేడా ఉండదంటూ, అందరూ బాధ్యతగా పనిచేయాలని, గ్రామాలు- వార్డుల అభివద్ధికి దోహదపడాలని మార్గదర్శకం చేశారు. ఈ టెలికాన్ఫరెన్‌‌సలో గ్రామీణాభివద్ది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు, జలవనరుల శాఖ ఛీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు, ఆర్ధికశాఖ కార్యదర్శి రవిచంద్ర, ఇతర అధికారులు కరికాల వలవన్‌, చక్రవర్తి, రమణ, వివిధ జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com