ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుకోకుండా అలా జరిగిపోయింది: భావన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 03:47 PM

హైదరాబాద్‌: కన్నడ నిర్మాత నవీన్‌తో తన నిశ్చితార్థం అనుకోకుండా జరిగిందని మలయాళీ నటి భావన అన్నారు. కొన్ని రోజుల క్రితం వీరిద్దరి నిశ్చితార్థం అతికొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మధ్య జరిగిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం బయటపడింది. లైంగిక వేధింపుల ఘటన అనంతరం సినీ పరిశ్రమ, మీడియాకు అందుబాటులో లేని సినీ నటి భావన మలయాళ మీడియాతో మాట్లాడింది. రహస్యంగా నిశ్చితార్థం చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న ప్రశ్నకు భావన సమాధానమిస్తూ, తన నిశ్చితార్థం విషయంలో రహస్యమేమీ లేదని చెప్పింది.  సంప్రదాయం ప్రకారం నవీన్‌ కుటుంబ సభ్యులతో కలిసి నన్ను చూడటానికి మా ఇంటికి వచ్చారు.  ఈ సందర్భంగా మాటల మధ్యలో రెండు కుటుంబాలు అంగీకరించిన తరువాత ఆలస్యమెందుకు అని చెబుతూ ఉంగరాలు మార్చుకోండని అన్నారని, దీంతో తన నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంగా ఘనంగా జరిగిందని తెలిపింది. దీంతో స్నేహితులను కూడా పిలవలేకపోయా. పెళ్లి విషయం ప్రకటించే వరకు నిశ్చితార్థం విషయం బయటపెట్టకూడదని అనుకున్నా’ అన్నారు. భావన, నవీన్‌ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.తన కుటుంబసభ్యులు తన ఫోటోలు షేర్ చేయడంతో విషయం బయటకు తెలిసిపోయిందని భావన తెలిపింది. వీరి వివాహ వేడుకను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com