లండన్ : విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూబీఎస్ బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించనందున మాల్యా వడ్డీతో సహా బ్యాంకర్ల లీగల్ ఫీజులు కూడా చెల్లించాల్సిందేనని లండన్ కోర్టు తీర్పు ఇచ్చింది. వాయిదాల పద్ధతిన చెల్లించేందుకు అనుమతించాలన్న మాల్యా వినతిని కూడా కోర్టు తోసిపుచ్చింది.