ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయెల్‌పై హమాస్ చేస్తున్న దాడులపై మియా ఖలీఫా పోస్ట్,,,,భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన పోర్న్ స్టార్

international |  Suryaa Desk  | Published : Tue, Oct 10, 2023, 10:22 PM

 ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేసిన ఆకస్మిక దాడులు తీవ్ర రూపు దాల్చాయి. హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఎదురు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు వైపుల నుంచి భారీగా రాకెట్ దాడులు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న దాడులను సమర్థిస్తూ పోర్న్ స్టార్ మియా ఖలీఫా చేసిన ట్వీట్ ఇటీవల తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఉగ్రవాద గ్రూప్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం, మాట్లాడటం ఏంటి అంటూ చాలా మంది నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేశారు. అయితే ఆమె చేసిన ఒక్క ట్వీట్ కారణంగా మియా ఖలీఫా భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఆమెతో చేసుకున్న ఒప్పందాన్ని కొన్ని కంపెనీలు రద్దు చేసుకున్నాయి.


మియా ఖలీఫా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీయడంతో ఆమెతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తాజాగా పలు కంపెనీలు రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితిపై ఆమె చేసిన ట్వీట్ కారణంగా మియా ఖలీఫాతో చేసుకున్న డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్లే బాయ్ మేగజైన్ వెల్లడించింది. వెంటనే తమ ప్లాట్‌ఫారమ్‌లో మియా ఖలీఫా యొక్క "ప్లేబాయ్" ఛానెల్‌ని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇక కెనడియన్ బ్రాడ్‌కాస్టర్ అండ్ రేడియో హోస్ట్ అయిన టాడ్ షాపిరో అనే సంస్థ మియా ఖలీఫాతో చేసుకున్న డీల్‌ను రద్దు చేసుకుంది. అయితే ఈ డీల్ ఒప్పందానికి చివరి దశలో ఉండగా.. దాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై మియా ఖలీఫా చేసిన ట్వీట్ చాలా భయంకరమైందని.. అందుకే ఆమెను తొలగించినట్లు ఆమె భావించాలని పేర్కొంది.


ఈ వ్యాఖ్యలు కేవలం అసహ్యకరమైనవే కావని.. అంతకుమించి అని తెలిపింది. మనిషిగా ఆలోచించండని.. హత్యలు, అత్యాచారాలు, హింసించడం, బంధీలుగా చేస్తున్న వారిని క్షమించడం అనేది చాలా తెలివితక్కువ పని అని.. ఇలాంటి అజ్ఞానానికి మాటలు చాలవు అంటూ టాడ్ షాపిరో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా ఇలాంటి విషాదాలు ఎదురైనపుడు మనుషులంతా కలిసి రావాలని.. ఆమె మంచి వ్యక్తిగా మారాలని తాము ప్రార్థిస్తున్నట్లు టాడ్ షాపిరో ట్విటర్‌‌లో పేర్కొంది. అయితే తన పోస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మియా ఖలీఫా వివరణ ఇచ్చారు. తాను చేసిన పోస్ట్ హింసను ప్రేరేపించే విధంగా లేదని స్పష్టం చేశారు. పాలస్తీనా పౌరుల గురించి చెప్పడానికి స్వాతంత్ర్య సమరయోధులు అనే పదాన్ని ఉపయోగించినట్లు తెలిపారు. పాలస్తీనా పౌరులు స్వేచ్ఛ కోసం నిత్యం పోరాడుతున్నారని అది వారి పోరాటానికి ఖచ్చితంగా ప్రాతినిధ్యం వహిస్తుందని పేర్కొన్నారు. పాలస్తీనాకు మద్దతు తెలపడం వల్ల తన వ్యాపార అవకాశాలు కోల్పోయేలా చేసిందని.. అయితే ఈ సందర్భంగానే తనను తొలగించిన కంపెనీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. జియోనిస్ట్‌లతో వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నానా లేదా అనేది చూసుకోనందుకు తనపై తనకు కోపం వచ్చిందని ఆమె తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com