జడ్చర్ల నియోజకవర్గం నవాబ్ పేట మండల పరిధిలోని పర్వతాపూర్ మైసమ్మ దేవాలయంలో బుధవారం ప్రసాద విక్రయాలకు సంబంధించి టెండర్లు నిర్వహిస్తున్నట్లు దేవాలయ అధికారి మదనేశ్వర్ రెడ్డి, ఆలయ చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. బుధవారం ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. కాగా గత ఏడాది ప్రసాదాల టెండర్ రూ. 11 లక్షలు పలికినట్లు అధికారులు తెలిపారు.