ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో బాలయ్య 101వ చిత్రం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 11:19 AM

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించ‌నున్న101 వ మూవీకి తొలి క్లాప్ ప‌డింది. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు ఫిల్మ్ న‌గ‌ర్ లోని స‌న్నిధానంలో తులసీవనం టెంపుల్ లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిత్ర ప్రారంభ పూజలు నేటి ఉద‌యం నిర్వ‌హించారు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో న‌టించే ఇత‌ర న‌టీ న‌టుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తారు. ఈ చిత్రం హైదరాబాద్ తో పాటు లండన్, స్పెయిన్ లో షూటింగ్ జరుపుకోనుంది. మార్చి 12 నుండి 22 వరకు యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించి ఆ తర్వాత ఇంగ్లండ్ వెళ్ళనున్నారు. ఏప్రిల్ 7 నుండి మే 7 వరకు దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరగనుంది. పూజా కార్య‌క్ర‌మానికి  బోయపాటి శ్రీను,క్రిష్, ఎస్వీ కృష్ణా రెడ్డి, ఆలీ, సుదీర్ బాబు తదితరులు హాజరయ్యారు. స్క్రిప్టును వెంకటేశ్వరుని పాదాలచెంత ఉంచి స్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం చిత్రం షూటింగ్ అధికారికంగా ప్రారంభమైనట్లయింది.సెప్టెంబర్ 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని టీం భావిస్తుంది. 


bbabalabalakrishnabalakrishna






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com