ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో షూటర్ సౌరభ్‌కు గోల్డ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 06, 2018, 12:25 PM

న్యూఢిల్లీ: షూటర్ సౌరభ్ చౌదరీ.. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. కొరియాలో జరుగుతున్న టోర్నమెంట్‌లో.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌లో.. షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. 245.5 పాయింట్ల స్కోర్‌తో జూనియర్ చాంపియన్‌షిప్‌లో వరల్డ్ రికార్డు సృష్టించాడు. గోల్డ్ గెలిచిన సౌరభ్‌ను కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మెచ్చుకున్నాడు. ట్యాలెంట్, హార్డ్‌వర్క్‌తో మన కుర్రాళ్లు పతకాలు గెలుస్తున్నారని ఆయన ట్వీట్ చేశారు. 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లోనే అర్జున్‌సింగ్ చీమా కాంస్య పతకాన్ని సాధించాడు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com