ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆంధ్ర శాసన సభ ప్రస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2017, 12:26 AM

 -ఇదొక చారిత్రాత్మక ఘటనకు శ్రీకారం
 -ఆధునిక సదుపాయాలతో శాసన సభ రూపుదిద్దుకుంది
 -ఒకప్పుడు చట్ట సభలంటే ఉన్న గౌరవం ఇప్పుడు లేదు
  -ప్రజల ధనాన్ని కూడా వృధా చేస్తున్నారు
  -సభ్యులను బహిష్కరించడం కూడా పరిపాటే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలో శాసన సభా సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయిు. ఇదొక చారిత్రాత్మక ఘటనకు శ్రీకారం. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత హైదరాబాద్‌లోనే రెండు రాష్ట్రాల శాసన సభా సమావేశాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు సచివాలయం తరలి పోయిన తర్వాత పాలన అంతా అమరావతి నుంచే సాగుతోంది. ఈ నేపధ్యం లో శాసన సభ సమావేశాలు కూడా స్వరాష్ర్టంలోనే జరగాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి కోడెల శివప్రసాద్‌ శాసన సభ నిర్మాణం తలపెట్టారు. అనతి కాలంలోనే ఆధునిక సదుపాయాలతో శాసన సభ రూపుది ద్దుకుంది. శాసన సభలో 175 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం నుంచి  102 మంది, వై.ఎస్‌.ఆర్‌ పార్టీ నుంచి 67 మంది, బి.జె.పి వారు  నలుగురు, మిగతా వారు ఇతరులు.
భారత దేశంలో ఒకప్పుడు చట్ట సభలంటే ఉన్న గౌరవం ఇప్పుడు లేదు. సభ్యులు కూడా వ్యక్తిగత ప్రయోజనాలకన్నా జాతి ప్రయోజనాలకే ప్రాముఖ్యత నిచ్చేవారు.నీతి, నిజాయితీగా ఉండేవారు. పదవంటే ప్రజలకు సేవ చేయడం అని భావించేవారు. కానీ ఇవ్వాళ రాజకీయం అంటే అర్ధం మారిపోయింది. విలువలూ తరిగిపోయాయి. పదవంటే డబ్బు సంపాదన కోసమే అనే భావన నెలకొంది. ప్రతి రోజూ రాజకీయ నాయకుల అవినీతి గురించి వింటూనే ఉన్నా ము. ఇప్పుడు  ఏ రాష్ర్ట శాసన సభా సవ్యంగా సాగటం లేదు. ఆ మాట కొస్తే పార్లమెంటు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రాంతీయ ఉద్యమాలు, అస మానతలు అన్నింటికీ వైదికగా నిత్యం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఘర్ష ణలకు దిగుతూ సభ్యులు సభకు తలవంపులు తీసుకొస్తున్నారు. ఇక రాష్ట్రా లను కూడా శాస్త్రీయంగా కాకుంగా కేవలం తమ పార్టీ అధికారం కోసం అనే స్వార్ధమైన భావనతో విడతీయడం బాధాకరం.  ప్రజా సమస్యల కోసం, అభి వృద్ది కోసం ఏర్పాటైన సభలలో ప్రజల చేత ఎన్నుకున్న నాయకులు, అక్కడ రాష్ర్ట, దేశ శ్రేయస్సు కోసం కాక తమ పార్టీ జండాలు, తమ స్వంత ఎజండాల కోసమే ముష్టి యుద్దాలకు సైతం పాల్పడటం నిజంగా దురదృష్టమే.  సభలో ఒకరిపై మరొకరు బురద చల్లుకుంటూ, విలువైన కాలాన్ని , ప్రజల ధనాన్ని కూ డా వృధా చేస్తున్నారు.  ఏ రాష్ర్ట అసెంబ్లీ చూసినా ఏమున్నది గర్వకారణం, ప్రతి రోజూ గందరగోళం, ప్రతి క్షణం తిట్ల దండకం. ఇదే నడుస్తున్న చరిత్ర.  సభలో నియమాళి ఉన్నా దాన్ని గురించి ఎవరూ పట్టించుకోరు. పార్లమెంటు అయినా రాష్ట్రాల అసెంబ్లీ అయినా ఏ సభ్యుడైనా  హుందాగా ప్రవర్తించకుండా అమా ర్యాదగా, అనుచితంగా ప్రవర్తిస్తే సభ నుంచి ఒక రోజు బహిష్క రిస్తారు. కానీ అలాకాకుండా అలాంటి సభ్యుడు మళ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా చట్టాలు వచ్చి నప్పుడే సభలు సవ్యంగా సాగుతాయి. కానీ అలాంటి కఠినమైన చట్టాలు వచ్చే అవకాశం లేదు.
ఇక అమరావతిలో ఆధునిక సౌకర్యాలతో, సర్వ హంగులతో సర్వాంగ సుం దరంగా నిర్మించిన  ఆంధ్ర ప్రదేశ్‌ శాసన సభ ఇక నవ్యాంధ్ర ప్రజలకు  చేరు వైంది. మన శాసన సభ ప్రస్ధానాన్ని తెలుసుకుందాం. మద్రాసు ప్రొవిన్‌‌స లేదా మద్రాసు ప్రెసిడెన్సీ  పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటయ్యింది. ఇందులో తమిళనాడు, ఆంధ్ర,ఒడిస్సా, కేరళ, కర్ణాటక కలసి ఉన్నాయి. చక్రవర్తి రాజ గోపాలాచారి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ద్వితీయ ప్రప ంచ యుద్దంలో భారత దేశం పాల్గొనడం రాజగోపాలాచారికి నచ్చలేదు. నిరస నగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆరు సంవత్సరాల పాటు గవర్న రు పాలన సాగింది.  ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. టంగు టూరి ప్రకాశం పంతులు  30 ఏప్రిల్‌ 1946 నుంచి 23 మార్చి 1947 వరకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com