ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పనిచేయకుండా ఎక్కువసేపు టాయిలెట్ లోనూ.. విధుల నుంచి తొలగించే నిర్ణయం తీసుకొన్న కంపెనీ

international |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 09:26 PM

చైనాలోని వాంగ్ అనే ఉద్యోగి ఆఫీసుకు వచ్చి గంటల తరబడి టాయిలెట్ లో గడపడంతో యాజమాన్యం మండిపడింది. విధి నిర్వహణ సమయంలో వాంగ్ దాదాపు రోజుకు 6 గంటల పాటు టాయిలెట్ లో గడుపుతున్నట్టు గుర్తించారు. ఒకసారి టాయిలెట్ లోకి వెళ్లాడంటే ఒక్కోసారి 3 గంటల సమయం పాటు బయటికి రాడు. ఇది ఉద్యోగ నిబంధనలకు విరుద్ధమని, సదరు ఉద్యోగిని విధుల్లో కొనసాగించలేమంటూ వేటు వేసింది. దాంతో ఆ ఉద్యోగి కోర్టును ఆశ్రయించాడు. తనకు మలద్వారం సమస్య ఉందని, ఈ కారణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆ ఉద్యోగి కోర్టును కోరాడు.  అయితే కోర్టు కంపెనీకే మద్దతుగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతూ అధిక సమయం పాటు టాయిలెట్ లో ఉంటే విధి నిర్వహణ కుంటుపడుతుంది కదా అని ఆ ఉద్యోగి తీరు పట్ల కోర్టు వ్యాఖ్యానించింది. విధులు 8 గంటలు అయితే, 6 గంటలు టాయిలెట్లోనే గడిపితే డ్యూటీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించింది. వాంగ్ ఎక్కువసేపు టాయిలెట్లోనే గడపడంపై కంపెనీ తగిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. దాంతో న్యాయస్థానం ఆ ఉద్యోగికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. ఆ కంపెనీలో ఉద్యోగానికి అనర్హుడని తీర్పు ఇచ్చింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com