రాస్తోవ్: సౌదీ అరేబియా ఫుట్‌బాల్ ప్లేయర్లు.. తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రష్యాలో వరల్డ్‌కప్ ఆడుతున్న ఆ ప్లేయర్లు ప్రయాణిస్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. రాస్తోవ్‌కు వెళ్తున్న సమయంలో ఓ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. దాన్ని విమానంలో ఉన్న ప్లేయర్లు వీడియో తీశారు. అయినా రష్యా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ సురక్షితంగా ల్యాండైంది. అయితే ప్లేయర్లు అంతా సురక్షితంగా ఉన్నట్లు సౌదీ ఫుట్‌బాల్ సంఘం వెల్లడించింది. ప్యాసింజర్ సీటు నుంచి ఓ ప్లేయర్ ఆ వీడియో తీశాడు. ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి అన్న విషయాన్ని మాత్రం రష్యా ఎయిర్‌లైన్స్ ఖండించింది. ఓ పక్షి ఢీకొనడం వల్ల మంటలు వచ్చి ఉంటాయని రష్యా నిపుణులు తెలిపారు.