పవిత్ర రంజాన ఉపవాస దీక్షలను ముస్లింలు శుక్రవారం ప్రారంభించారు. ఉదయం సహేర్‌తో రోజా దీక్షలను ప్రారంభించి, సుమారు 14 గంటల పాటు ఉపవాసం పాటించి సాయంత్రం ఇఫ్తార్ సమయంలో దీక్షను విరమించారు. రంజాన నెల మొదలైన సందడి బనగానపల్లె పట్టణంలో బాగా కనిపించింది. సాయంత్రం ఇఫ్తార్ వేళ పట్టణంలో ఇఫ్తార్ విందుకు సంబంధించిన అనేక తిరుబండారాలను విక్రయాలకు పెట్టారు. అలాగే మసీదుల ప్రాంతాల్లోనూ ఇఫ్తార్‌కి సంబంధించిన ఖర్జూర ఫలాలు, పండ్లు వంటివి అమ్మకాలకు పెట్టారు.