రానున్న 6 నెలల్లో దేశంలోని టోల్ ప్లాజాలు తీసేసి, వాటి స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ కలెక్షన్ సిస్టమ్ ను ప్రవేశపెడతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, హైవేపై ప్రయాణించే ఖచ్చితమైన దూరానికి మాత్రమే టోల్ వసూలు చేయాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రస్తుతం రూ.40 వేల కోట్లుగా ఉన్న టోల్ ఆదాయం వచ్చే మూడేళ్లలో రూ.1.40 లక్షల కోట్లకు చేరుకుంటుందని అన్నారు.