స్నేహితుడిని ఆటకట్టించేందుకు ఇద్దరు యువకులు శుక్రవారం అర్ధరాత్రి వేళలో దెయ్యాల వేషంతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఆ వేళదారణలను చూసి స్థానికులు భయంతో కేకలు వేసి పరుగులు తీశారు. అక్కడివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దెయ్యాల వేషధారులను పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.