సిరియాలో దాడులు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ సంయుక్తంగా దాడులు జరుగుతున్నాయన్నారు. సిరియాలో రసాయన దాడుల నేపథ్యంలో అమెరికా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. సిరియాలో రసాయన దాడుల వెనక రష్యా హస్తం ఉందని ఆరోపించారు. రసాయన ఆయుధాలు కలిగిన స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయని ప్రకటించారు.