ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లూరి సీతారామరాజు వేషధారణలో ఎంపీ శివప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 02, 2018, 11:10 AM

ఏపీకి ప్రత్యేక హోదా కోసం చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన స్టైల్లో నిరసన తెలుపుతున్నారు. రోజుకో వేషధారణలో వస్తూ ఏపీకి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. సోమవారం బ్రిటీష్ వారిని గడగడలాడించిన సాయుధ పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు వేషధారణలో వచ్చిన ఎంపీ శివప్రసాద్ పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలతో కలిసిన నిరసన తెలియజేశారు. ‘తెలుగువీర లేవరా దీక్షబోని సాగరా... ఆంధ్రప్రజల హక్కు కొరకు తిరుగబాటు చేయరా. పిల్లలేకాదు..పెద్దలేకాదు.. స్త్రీమూర్తులు అందరూ ఏకమై నిలవరా... విజయం సాధించరా’ అంటూ పాట పాడుతూ ఎంపీ శివప్రసాద్ నిరసన తెలియజేశారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com