ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 31, 2018, 08:55 AM

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ​భక్తులు 29​ కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ​14​ గంటల సమయం పట్టవచ్చు. ప్రత్యేక దర్శనం వారికి 2​ గంటల సమయం పడుతుంది. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి ​12:00​ గంటల నుండి అలిపిరి ​14,​ శ్రీవారి మెట్టు ​6​ వేల దివ్యదర్శనం టోకెన్లు జారీచేయబడును, మొత్తం ​20​ వేల టోకెన్లు పూర్తయిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: ​08​ గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. నిన్న ​81,665​ మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.55​ కోట్లు. నిన్న ​37,751​ మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com