రష్యాలోని సెవెరో కురిల్క్స్ పట్టణంలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భూకంపం 67.8 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెంది భయంతో పరుగులు తీశారు. సెవెరో కురిల్క్స్ రష్యాలోని ఉత్తర కురిల్ దీవులలోని ఒక నగరం.