ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత క్రికెటర్లకు భారీగా పెరిగిన వేతనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 08, 2018, 08:51 AM

న్యూఢిల్లీ: భారత క్రికెటర్లకు వార్షిక వేతనాలను బీసీసీఐ భారీగా పెంచింది. ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్లకు రూ. 7 కోట్ల వార్షిక వేతనం, ఏ గ్రేడ్ క్రికెటర్లకు రూ. 5 కోట్ల వార్షిక వేతనం, బీ గ్రేడ్ క్రికెటర్లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం, సీ గ్రేడ్ క్రికెటర్లకు రూ. 1 కోటి వార్షిక వేతనం చెల్లించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఏ ప్లస్ గ్రేడ్ క్రికెటర్లులో కోహ్లి, ధావన్, రోహిత్, భువనేశ్వర్, బుమ్రా ఉండగా... ఏ గ్రేడ్ క్రికెటర్లలో ధోని, అశ్విన్, జడేజా, పుజారా, విజయ్, రహానె, సాహా ఉన్నారు. ఇక.. బీ గ్రేడ్ క్రికెటర్లలో.. చాహల్, కుల్దీప్, హార్దిక్, ఉమేశ్, రాహుల్, ఇషాంత్, దినేశ్ ఉన్నారు. కాంట్రాక్టు జాబితాలో ఈ ఏడాది 26 మందికే బీసీసీఐ చోటు కల్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com