ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐసీయూకి ములాయం సింగ్ యాదవ్...క్షీణించిన ఆరోగ్యం

national |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 08:29 PM

యూపీ రాజకీయ దురందరుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకనేత ములాయం సింగ్ యాదవ్ (82) ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో ఆయనను ఐసీయూకి తరలించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ములాయం ఆగస్టు 22వ తేదీ నుంచి గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆంకాలజిస్టులు డాక్టన్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల్ కటారియాల పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ములాయం ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న సమాచారంతో ఆయన తనయుడు, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ హుటాహుటీన ఆసుపత్రికి చేరుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి వద్దకు వచ్చారు. గతేడాది జులైలోనూ ములాయం అస్వస్థతతో ఆసుపత్రిపాలయ్యారు. ఇదిలావుంటే ములాయం త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ దాస్ మౌర్య తెలిపారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా ములాయం ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com