ఈ రోజు విడుదలైన పద్మావత్ సినిమాకు రాజకీయ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వస్తున్నది. కొందరు సినిమాను అద్భుత కళాఖండంగా ప్రశంసలు కురిపిస్తుంటే మరి కొందరు ఇటువంటి వివాదాస్పద అంశాలున్న సినిమాలు రాకుండా ఉంటే బాగుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ఒక వర్గం ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న పద్మావత్ వంటి సినిమాలు తీయకుండా ఉండటం మంచిదని పేర్కొన్నారు.