ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూల్‌లో అటవీశాఖ అధికారి రాసలీలలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2018, 12:52 PM

కర్నూలు: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారుల రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు రోజుల క్రితం మహిళా ఏఎస్పీ- ఎస్ఐ అడ్డంగా బుక్కయిన విషయం తెలిసిందే. వారిద్దరూ ఇంట్లో ఉండగా అక్కడికి చేరుకున్న మహిళా ఏఎస్పీ భర్త, తల్లిదండ్రులు కిలోమీటర్ మేర ఎస్‌ఐని చెప్పులతో కొట్టి తరిమారు. అయితే ఈ వ్యవహారం మరిచిపోక ముందే ఏపీలోని కర్నూలు జిల్లాలో మరో అధికారి రాసలీలల గుట్ట రట్టైంది. 


అటవీశాఖ నిఘా విభాగం అధికారిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు పాడు పనిచేస్తూ విద్యార్థి సంఘాలకు అడ్డంగా బుక్కయ్యారు. వెంకటేశ్వరరావు నగర శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌లో వేరే మహిళతో ఉండగా చూసిన విద్యార్థి సంఘాల నాయకులు దాడిచేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మహిళను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుపై యాక్షన్ తీసుకుంటారా? లేదా అనే విషయం తేలాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com