ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలిన భారీ వృక్షం.. తప్పిన పెను ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 01:16 PM

భారీ వర్షానికి రహదారిలో భారీ వృక్షం నేలకొరిగింది. ఆ సమయంలో అటుగా ఎవరూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రోడ్డుకు అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపో యాయి. అప్పలరాజుగూడెం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్థానికులు చెట్టును తొలగించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం తొలగింది. ఈ కార్యక్రమంలో జి సురేంద్రనాథ్, మెతుకుమిల్లి శ్రీనివాస్, ఎల్లిన జగన్, మొవ్వ వెంకటకృష్ణ, ఉల్లూరి నరేంద్ర, ఉల్లూరి మోహనరావు, సాయి, పవన్ ఆధ్వర్యంలో టిడిపి పార్టీ యువత, పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com