ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా రెగడగట్ట అనే చిన్న గ్రామంలో ఓ అంతుచిక్కని వ్యాధి ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. గ్రామంలో గత ఆరు నెలల్లో 61 మంది మృతిచెందారు. 800 మంది ఉండే ఈ గ్రామంలో గత రెండేళ్లుగా ఈ వ్యాధి కలకలం సృష్టిస్తోందని అధికారులు తెలిపారు. కాళ్లలో, ఇతర అవయవాల్లో వాపు ఈ వ్యాధి లక్షణంగా పేర్కొన్నారు. రక్త నమూనాలను పరీక్షలతో పాటు నీరు, భూసార పరీక్షలు చేసినా మరణాలకు కారణం తెలియలేదు.
![]() |
![]() |