తైవాన్ రక్షణ శాఖ పరిధిలోని ఓ కీలక అధికారి అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. తాజాగా దక్షిణ తైవాన్ లోని పింగ్ టంగ్ పర్యటనలో ఇది చోటు చేసుకుంది. తైవాన్ రక్షణ శాఖలోని పరిశోధన అభివృద్ధి విభాగం హెడ్ గా పనిచేసే యాంగ్ లీషింగ్ ఓ హోటల్ రూమ్ లో మరణించినట్టు గుర్తించారు. అయితే, యాంగ్ లీషింగ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తైవాన్ పై చైనా ప్రతీకార చర్యలకు దిగడం తెలిసిందే.