ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సులభంగా చేసుకునే చింతపండు చారు ..!!

Recipes |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 09:16 PM


కావలసిన పదార్ధాలు: చింతపండు - 50గ్రా., పసుపు - చిటికెడు, ఉప్పు - రుచికి సరిపడా, కారం - అరస్పూన్, పచ్చిమిర్చి - 2, ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా, కరివేపాకు, కొత్తిమీర తరుగు - గుప్పెడు, నూనె - సరిపడా.
తయారీ విధానం:
-- చింతపండును రెండు లోటాల నీళ్ళల్లో వేసి, బాగా పిసకాలి.
-- అందులో ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, వేసి ఒక పావుగంటసేపు మరగనివ్వాలి.
-- బాగా మరిగిన తరవాత అందులో కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
-- బాణలి స్టవ్ మీద పెట్టి, నూనె వేసి, కాగాక అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి వేసి బాగా వేగాక ఈ తాలింపును చారులో వేసి వెంటనే మూత పెట్టెయ్యాలి.
-- ఇలా చింతపండు చారు ఎంతో సులభంగా చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com