కావలసిన పదార్ధాలు: టమాటో - 3, పచ్చిమిర్చి - 3, చింతపండు - చిన్న సైజు నిమ్మకాయంత, కొత్తిమీర తరుగు - గుప్పెడు, కరివేపాకు - 1 రెబ్బ, మిరియాలు - 1 స్పూన్, జీలకర్ర - 1స్పూన్, వెల్లుల్లి - 5, ఆవాలు - అర స్పూన్, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - చిటికెడు.
తయారీవిధానం:
-- ముందుగా టొమాటోలను చిన్నముక్కలుగా కట్ చేసి, గిన్నెలో వేసి, చేతితో బాగా పిసకాలి. లేకుంటే కచ్చాపచ్చాగా రోట్లో దంచుకున్నా పర్లేదు.
-- రసం బాగా వచ్చిన తర్వాత టమాటో పిప్పిని తీసేసి, ఆ రసంలో కొత్తిమీర తరుగు, ఉప్పు, పసుపు, చింతపండు రసం, బారుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి స్టవ్ మీద పెట్టాలి.
-- ఇది మరిగేలోపు మిక్సీ జార్లో మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-- రసం ఒక పోంగొచ్చిన వెంటనే ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా మరగనివ్వాలి.
-- రెండు, మూడు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరి... రుచికరమైన టమాటో రసం రెడీ.