ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుదీనా, కొత్తిమీర తో వెరైటీ రెసిపీ

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 07:18 PM

కావాల్సిన పదార్ధాలు : పుదీనా - 1 కట్ట, కొత్తిమీర - 1 కట్ట, చింతపండు - కొద్దిగా, కరివేపాకు - రెండు రెబ్బలు, పచ్చిమిర్చి - 100గ్రా., టమాటో - 1, చిన్నుల్లి - 3, ఆవాలు - 1 స్పూన్, జీలకర్ర - 1 స్పూన్, ఎండుమిర్చి - 2, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా.
తయారీవిధానం:
-- కొత్తిమీర, పుదీనాలను నీటితో శుభ్రంగా కడిగి, కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-- పచ్చిమిర్చి తొడియాలను వలిచి నీటితో కడిగి, సగానికి కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే, పచ్చిమిర్చిని వేపుతున్నప్పుడు పేలకుండా ఉంటాయి.
-- ఇప్పుడు స్టవ్ వెలిగించి, కళాయి పెట్టి, రెండు స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యండి.
-- నూనె బాగా కాగాక, అందులో పచ్చిమిర్చిని వేసి దోరగా వేపుకోవాలి. ఆపై అందులో పుదీనా, కొత్తిమీరను వేసి ఇంకాస్తసేపు వేపుకోవాలి.
-- ఈలోపు టొమాటోలను కూడా నాలుగు పక్షాలుగా కోసి కళాయిలో వెయ్యండి. టమాటో పచ్చడి రుచిని రెట్టింపు చేస్తుంది.
-- ఒక పావుగంటపాటు సిమ్ లో ఉంచి మూత పెట్టండి. ఆపై పొయ్యి కట్టేసి చల్లారబెట్టండి.
-- ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని అదనంగా జీలకర్ర, చిన్నుల్లి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు (టమాటో లేకపోతే) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
ఆ తర్వాత ఇందాక వాడిన కళాయిలోనే మరికొంచెం నూనె వేసి, బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, చిన్నుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేపండి. ఆపై మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చెయ్యండి.
-- అంతే... ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన పుదీనా, కొత్తిమీర పచ్చడి రెడీ అయినట్టే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com