--- ప్రపంచంలోని స్కూల్స్ సగటున పనిచేసే రోజుల సంఖ్య 200. జపాన్ లో ఈ సంఖ్య అత్యధికంగా 243 కాగా, స్వీడన్ లో అత్యల్పంగా 173 రోజులు.
--- అమెరికాలోని న్యూహ్యాంప్ షైర్ రాష్ట్ర నినాదమేంటో తెలుసా... లివ్ ఫ్రీ ఆర్ డై (స్వేచ్ఛగా బతుకు లేదా చావు ). ఆ రాష్ట్రంలో తిరిగే చాలా కార్ల పై ఈ నినాదమే ఉంటుంది.
--- పెదాలకు వేసుకునే చాలారకాల లిప్ స్టిక్స్ తయారీలో చేప పొలుసులు ఉపయోగిస్తారని మీకు తెలుసా!
--- వెంట్రుకతో సమానమని తీసిపారేస్తుంటాం కదా... ఇంకోసారి ఎప్పుడూ అలా అనకండి. ఎందుకంటే, ఒక తల వెంట్రుక సుమారు మూడు కిలోల బరువును మోయగలదు.