ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంగాళదుంపతో ఫ్రెష్‌గా బ్రెడ్

Life style |  Suryaa Desk  | Published : Sat, Jun 11, 2022, 03:47 PM

మహిళలు ఇంట్లో ఎంత పని చేసినా.. పని ఉంటూనే ఉంటుంది. అందులో వంటింట్లో 24 గంటలు పని ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులుంటాయి. చూడ్డానికి చిన్న చిన్న పనులే అయినా ఓపికగా చేయాల్సి ఉంటుంది.
అయితే ఇంట్లో పనులను స్మార్ట్‌గా చేసుకుంటే తొందరగా అయి.. చాలా సమయం సేవ్ అవుతుంది. దీనికోసం స్మార్ట్ కిచెన్ గ్యాడెట్లను ఉపయోగించడమే కాకుండా.. చిన్న చిన్న చిట్కాలను ఫాలో అవ్వాలి. చిట్కాలు చిన్నవే అయినా.. పెద్ద పెద్ద పనులే అవుతాయి.
ఇంట్లో పెరుగు తోడు పెట్టుకోవడం పెద్ద పని కాకపోయినా.. ప్రతి రోజూ చేసుకోవాల్సిన పని. ఇలా తోడు పెట్టుకున్న పెరుగు తొందరగా పాడవ్వకుండా ఉండాలంటే కొబ్బరి ముక్కను పెరుగులో వేయాలి. అలాగే బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో ఉంచితే మెత్తబడవు.
అలాగే బ్రెడ్ ప్యాకెట్లో బంగాళదుంప ఉంచితే బ్రెడ్ తొందరగా పాడవదు. పండిన టమాటాలను ఉప్పు నీళ్లలో వేస్తే పగిలిపోవు. అలాగే కారంపొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క ఉంచితే పురుగు పట్టదు. కూరగాయ ముక్కల్ని పసుపు నీటిలో ఉంచితే క్రిములు నశిస్తాయి.
అంతేకాదు కొత్తిమీర కాడల్ని సాంబారు లేదా పులుులో వేస్తే మంచి వాసన వస్తుంది. పులుసులో ఉప్పు ఎక్కువైనప్పుడు చపాతి పిండి ఉండలుగా వేసి తీస్తే రుచిగా ఉంటంది. చక్కెర డబ్బాలో లవంగాలు వేస్తే చీమలు పట్టవు. మిరపపొడి ఎక్కువ రోజులు ఉండాలంటే డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేయాలి. బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో మిరపకాయలు లేదా వేపాకులు వేస్తే పురుగులు పట్టవు. పండిన టమాటాలను ఉప్పు కలిపిన నీటిలో ఉంచితే తాజాగా ఉంటాయి.
ఈ చిట్కాలను ఫాలో అయితే వంటింట్లో ప్రతి మహిళకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com