ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వ్యక్తి పై ఎలుగుబంటి దాడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 03, 2022, 02:38 PM

మర్రిపాడు మండల పరిధిలోని పడమటి నాయుడు పల్లి గ్రామ అడవిలో కుంటా చిన్నయ్య అనే వ్యక్తి పై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిల మేరకు నాయుడు పల్లికి చెందిన కుంటా చిన్నయ్య రెండు రోజులుగా తమ గేదెలు కనిపించకపోవడంతో వాటిని వెతికేందుకు శుక్రవారం తెల్లవారు జామున అడవికి బయలుదేరి వెళ్ళాడు. వెతుకుతున్న క్రమంలో వెలుగుబంటి చిన్న‌య్య పై దాడి చేసింది. కేకలు వేయడంతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి చిన్నయ్య దగ్గరకు పరిగెత్తడంతో వెలుగుబంటి అడవుల్లోకి పారిపోయినట్లు బాధితుడు తెలిపాడు. చిన్నయ్య ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ట్రాక్టర్ లో వచ్చి బాధితుడిని గ్రామానికి తీసుకొచ్చి మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక వాహనంలో ఆత్మకూరుకు తరలించారు.   చిన్నయ్యకు మొఖం చేతిపై గాయాలయ్యాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com