కావలసిన పదార్థాలు : మామిడికాయలు - 2, పుదీనా ఆకులు - కొన్ని, నిమ్మకాయ - 2, తేనె - 3 స్పూన్లు, ఐస్ క్యూబ్స్, సోడా .
తయారీవిధానం : ముందుగా మ్యాంగో ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందుకోసం మామిడికాయ తోలు తీసి, చిన్న ముక్కలుగా కోసి, మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని మిశ్రమంలా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైత్ కొద్దిగా నీళ్లను కూడా వాడొచ్చు. తర్వాత ఒక నిమ్మకాయను చిన్న ముక్కలుగా కోసి, మరో నిమ్మకాయను రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడొక గ్లాసును తీసుకుని అందులో నిమ్మకాయ ముక్కలను, పుదీనా ఆకులను వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ఇందాక తయారుచేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరిని నాలుగైదు స్పూన్లను, నిమ్మరసాన్ని, ఐస్ క్యూబ్స్ ను, మూడు స్పూన్ల తేనెను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో సోడాను గాని, చల్లని నీళ్లను గాని పోసి సర్వ్ చేసుకుంటే సరి. మామిడి కాయలను ముక్కలుగా తినటం బోర్ కొట్టినవాళ్లు ఒక్క సారి ఈ రెసిపీని ట్రై చెయ్యండి. తప్పకుండా నచ్చుతుంది.