ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగుస్తున్న పెళ్లి ముహూర్తాలు

national |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 05:14 PM

కరోనా రావడంతో రెండేళ్లుగా వివాహాలు తక్కువగా జరిగాయి. గత రెండు నెలల వ్యవధిలో రికార్డు స్థాయిలో రెండు లక్షలకు పైగా పెళ్లిళ్లు జరిగాయి. ఇక పెళ్లి ముహూర్తాలు జూన్ 23తో ముగుస్తున్నాయి. జూన్ 29 నుంచి జూలై 30వతేదీ వరకు ఆషాఢం, ఆగస్టు 23 నుంచి నవంబర్ 27వ తేదీ వరకు భాద్రపద, ఆశ్వీయుజ, కార్తీక మాసాల్లో శుక్రమౌఢ్యమి (మూఢం) ఉంటుంది. డిసెంబర్ 1 తర్వాత శుభముహూర్తాలు ఉంటాయి. 5 నెలల పాటు ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది పెళ్లిళ్లు తొందరగా కానిచ్చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూన్‌లో 1 నుంచి 6వ తేదీ వరకు, 8 నుంచి 11వ తేదీ వరకు, 13, 15, 16, 17, 18, 19, 22, 23 తేదీలలో శుభ ముహూర్తాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com