ప్రేమ వ్యవహారాలు ఇటీవల కాలంలో దారుణ హత్యలకు దారి తీస్తున్నాయి. కర్నాటకలోని కాలబురాగి జిల్లాలోని భీమానగర్కు చెందిన విజయ్ కాంబ్లే(25) ఓ ముస్లిం యువతిని ప్రాణంగా ప్రేమించాడు. అతడిని యువతి సోదరులు షాహుద్దీన్, నవాజ్ పలుమార్లు హెచ్చరించారు. నరికేస్తామంటూ ఇటీవల అతడి ఇంటికొచ్చి మరీ బెదిరించారు. పక్కా ప్లాన్ వేసి సోమవారం విజయ్ను హత్య చేశారు. కొడుకు హత్యతో విజయ్ తల్లి బోరున విలపించింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.