ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు కలెక్టర్ పరామర్శ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 12:34 PM

మోపిదేవి మండలం కాసానగర్ శివార్లలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారంతా కోలుకుంటున్నారని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడి మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కలెక్టర్ శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై వాకబు చేశారు. 20 మంది పెళ్లి బృందంలో ఐదుగురు మృతి చెందగా 15 మంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిలో 10 మంది మచిలీపట్నంలో, ఐదుగురు విజయవాడలో చికిత్స పొందుతున్నారని, వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని కలెక్టర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com