ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:51 PM

వేసవిలో షుగర్​ పేషంట్ లు పలు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఒంట్లోని నీరంతా చమట రూపంలో బయటకు వెళ్లిపోవడం వల్ల నీరు, లవణాల సమతూకం దెబ్బతింటుంది. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతుంటారు. నీరసంతో కూలబడుతుంటారు. రక్తంలో గ్లూకోజ్​ శాతాలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. కాబట్టి వేసవిలో ఎదురయ్యే ఈ ప్రత్యేక పరిస్థితులను తట్టుకునేందుకు షుగర్​ బాధితులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో మధుమేహులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- నీరు, పళ్ల రసాలు, ద్రవ పదార్థాలను తీసుకోవాలి.
- దప్పిక వేయకున్నా తరచూ మంచి నీటిని తాగాలి.
- ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ వెంటే ఉంచుకోవాలి.
- వాతావరణం చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం మాత్రమే వ్యాయామం చేయాలి,
- మందులను చల్లటి ప్రాంతంలోనే ఉంచాలి.
- షుగర్ మందుల వల్ల వేసవిలో చర్మం సున్నితంగా మారే అవకాశం ఉంది. కాబట్టి, బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా సన్​స్క్రీన్ లోషన్​ లను రాసుకోవాలి.
- పాదాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- కాలి వేళ్లకు సాధ్యమైనంత వరకు ఎండ తగలకుండా చూసుకోవాలి.
- తరచూ బ్లడ్, షుగర్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com