ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 11:52 AM

ఏపీలోని అన్నమయ్య జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి మండలంలో కల్వర్టును కారు ఢీకొట్టి కిందపడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పుంగనూరు రోడ్డులోని 150వ మైలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులను ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. వారిలో దంపతులతో సహా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com