ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీ ఐ ఫోన్ ఆ ప్రాసేసర్ లో ఉందా అయితే...వెంటన్ అప్ గ్రేడ్ చేసుకోండి

Technology |  Suryaa Desk  | Published : Wed, May 25, 2022, 03:36 PM

మీరు వాడితే ఐ ఫోన్ అయితే మీరు ఏ ప్రాసేసర్ లో మొబైల్ వాడుతున్నారో ఓ సారి పరిశీలించుకోండి. లేకపోతే మీ ఐ ఫోన్లో వాట్సప్ సౌకర్యం నిలిచిపోయే అవకాశముంది. ఈ సంవత్సరం మరిన్ని డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయాలని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతున్న ఫోన్‌లకు సర్వీస్ నిలిపివేయాలని భావిస్తోంది. ప్రతీ సంవత్సరం కొన్ని డివైజ్‌లకు సపోర్ట్ ఆపేస్తున్న వాట్సాప్‌ ఈ ఏడాది కూడా చర్యలను తీసుకుంటోంది. అయితే ఏ ఆపరేటింగ్ సిస్టమ్‌లపై నడిచే ఐఫోన్‌లకు వాట్సాప్‌ సపోర్ట్ నిలిచిపోతుందన్న విషయాన్ని డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది.


ఐఓఎస్ 10, ఐఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇంకా రన్ అవుతున్న డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయాలని వాట్సాప్‌ నిర్ణయించుకుందని, వాటికి ఇప్పటికే ఇన్-యాప్‌ నోటిఫికేషన్లను పంపుతోందని పేర్కొంది. “2022 అక్టోబర్ 24 తర్వాత ఈ వెర్షన్‌లో వాట్సాప్‌ పని చేయడం ఆగిపోతుంది. దయచేసి సెట్టింగ్‌లోని జనరల్ సెక్షన్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై ట్యాప్ చేయండి. మీ డివైజ్‌ను లేటెస్ట్ ఐఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోండి” అని ఇన్‌యాప్ మెసేజ్‌లో వాట్సాప్‌ సూచిస్తోంది. అంటే ఐఓఎస్‌ 12 లేదా అంతన్నా లేటెస్ట్ ఐఓఎస్ ఉన్న ఐఫోన్‌లలోనే అక్టోబర్ 24 తర్వాత వాట్సాప్‌ పని చేస్తుందన్న మాట.


ఒకవేళ మీ ఐఫోన్ ఇంకా ఐఓఎస్ 10 లేద ఐఓఎస్ 11 పై రన్ అవుతుంటే ..ఐఓఎస్ 12 లేదా లేటెస్ట్ ఐఓఎస్ 15.. ఇలా మీ ఫోన్‌కు సపోర్ట్ చేసే దానికి అప్‌గ్రేడ్ కావొచ్చు. ఇలా చేస్తే వాట్సాప్‌ను అక్టోబర్ 24 తర్వాత కూడా వినియోగించుకోవచ్చు. ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ మొబైళ్లను ఇంకా వినియోగిస్తున్నట్టయితే మీరు iOS 12కు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. ఈ ఫోన్ యూజర్లకు చింత లేదు. అయితే ఐఫోన్ 5 (ఐ ఫోన్ 5) , ఐఫోన్ 5సీ (ఐ ఫోన్ 5 సీ) మోడళ్లు అప్‌డేట్‌కు సపోర్ట్ చేయవు. అంటే అక్టోబర్ 24 తర్వాత ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ పని చేయదు. ఒకవేళ ఎవరైనా ఇంకా ఈ మొబైళ్లు వాడుతుంటే.. కొత్త ఫోన్‌కు మారాల్సిందే.


ఈ సంవత్సరం ఐఓఎస్ 16, ఐ ప్యాడ్ ఓ ఎస్16, మ్యాక్ ఓఎస్ 13 వెర్షన్‌లను వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్లూ, డబ్ల్యూ డీసీ )లో యాపిల్ విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో iOS 10, iOS 11 డివైజ్‌లకు సపోర్ట్ నిలిపివేయాలని వాట్సాప్‌ భావిస్తోంది. మరోవైపు ఇప్పటికీ ఆండ్రాయిడ్‌ 4.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తున్న మొబైళ్లను అప్‌డేట్‌ చేసుకోవాల్సిందిగా వాట్సాప్‌ సూచిస్తోంది. ఒకవేళ అప్‌డేట్‌కు సపోర్ట్ చేయని ఫోన్‌లో వాట్సాప్‌ సేవలు త్వరలోనే నిలిచిపోనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com