--- ఫుట్ బాల్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడైన క్రిస్టియానో రోనాల్డో తన దగ్గర ఉన్న గోల్డెన్ బూట్లలో ఒక బూట్ ను 1.5 మిలియన్ డాలర్లకు అమ్మేసి, ఆ మొత్తాన్ని పాలస్తీనా లోని చిన్నపిల్లల సంక్షేమానికి విరాళంగా ఇచ్చేశాడట. గోల్డెన్ బూట్లంటే కాలికి వేసుకునే బంగారు బూట్లనుకునేరు ! కాదు. ఫుట్ బాల్ ఆటలో గోల్డెన్ బూట్ అనే ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఆ లీగ్ లో అతధిక గోల్స్ చేసిన ఆటగాడికి గోల్డెన్ బూట్ అవార్డును ఇస్తారు.
--- శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ అనే ఆధునిక కంటిని తయారు చేసారు. దీనివల్ల జన్మతః అంధులకు ఈ ప్రపంచాన్ని చూసే బంగారు అవకాశం దక్కింది.
--- ఒక సైకలాజికల్ అధ్యనం ప్రకారం, ప్రపంచజనాభాలో సుమారు 72శాతం మంది వారు స్నానం చేస్తుండగా క్రియాత్మక ఉపాయాలను, క్రేజీ ఆలోచనలను చేస్తారట.