జమైకాలోని ఓ జూ పార్క్ లో ఓ సింహం జూ కీపర్ చేతి వేళ్లను కోరికేసింది. ఆ జూ కీపర్ తన చేతులను కంచె లోపలికి దూర్చి సింహాన్ని ఆటపట్టిస్తుండగా, ఒక్కసారిగా ఆ సింహం అతని చేతివేళ్లను నోటకరచుకుంది. ఎంత లాగినా అది విడిచిపెట్టలేదు. చివరకు అతను ఉంగరపు వేలిని పూర్తిగా కోల్పోయాడు. గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటగా దీన్నొక జోక్ గా భావించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జూ యాజమాన్యం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్లు 'జమైకా సొసైటీ ఫర్ ది ప్రివెన్షనల్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్' ఎండీ పమేలా లాసన్ తెలిపారు.