ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ చిట్కాలతో హ్యాంగ్ ఓవర్ మాయం!

Life style |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 12:35 PM

మందు పార్టీలు ఎంజాయ్ ఇచ్చినా.. ఆ మరుసటి రోజు కొంత మందిలో హ్యాంగ్ ఓవర్ రూపలో నరకం చూడాల్సి వస్తుంది. పార్టీ సమయంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అలసట, డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, అలసట, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. అయితే హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడేందుకు ఈ చిట్కాలు పాటించండి.

-ఉదయం లేవగానే నిమ్మరసంలో చిటికెడంత తేనె కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది.
- ఎక్కువగా నీరు తాగడం వల్ల హ్యాంగ్ ఓవర్ ను వదిలించుకోవచ్చు. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత నీరు తాగాలి.
-ఉదయం నిద్రలేచిన వెంటనే అల్లం, తేనె బ్లాక్ టీ తాగితే మీ తలనొప్పి పోతుంది.
- హ్యాంగ్ ఓవర్ కారణంగా వాంతులు చేసుకుంటే ఆ వాంతులు ఆగిన తర్వాత కొబ్బరి నీళ్లు తీసుకోండి. శరీరానికి నీటి కొరత త్వరగా తీర్చే గుణం కొబ్బరి నీళ్లకు ఉంది.
-పెరుగులో ఉండే యాసిడ్ కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.
-ఫుల్లుగా మద్యం సేవించడం వల్ల శరీరంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం స్థాయిలు పడిపోతాయి. వాటిని తిరిగి నింపడానికి రెండు అరటి పండ్లు తినండి.
-నువ్వుల గింజలకు బెల్లం కలుపుకుని తినండి. దాంట్లో కొద్దిగా అల్లం వేసి తీసుకుంటే మరీ మంచిది. దెబ్బకు రాత్రి తాగిందంతా దిగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com