ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛార్జీల రూపంలో..పీఎన్ బీ ఏకంగా రూ.645 కోట్ల రాబట్టింది

business |  Suryaa Desk  | Published : Sun, May 22, 2022, 08:40 PM

ఛార్జీల మోతతో బ్యాంకులు ఏ స్థాయిలో సామాన్యుడి నుంచి సంపాదిస్తున్నాయో ఇటీవల ఓ వ్యక్తి పిటిషన్ తో తేటతేలమైంది. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ) ఏటీఎం లావాదేవీల ఛార్జీల కింద ప్రజల నుంచి రూ.645 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్ల నుంచి ఏటీఎం ఛార్జీల కింద రూ.645.67 కోట్ల మొత్తాన్ని వసూలు చేసినట్టు పీఎన్‌బీ ప్రకటించింది. ఆర్‌టీఐ యాక్ట్ కింద దాఖలైన ఓ దరఖాస్తుకి సమాధానంగా పీఎన్‌బీ ఈ మేరకు సమాధానమిచ్చింది. అంతే కాక బ్యాంకు అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లను నిర్వహించని కస్టమర్ల నుంచి భారీగానే పెనాల్టీల కింద ఈ బ్యాంకు వసూలు చేసింది. మినిమమ్ బ్యాలెన్స్ పెనాల్టీ కింద రూ.239.09 కోట్లను ఆర్జించినట్టు దేశంలోని రెండో అతిపెద్ద బ్యాంకు తెలిపింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ అప్లికెంట్ చంద్రశేఖర్ గౌర్ ఈ ఆర్‌టీఐ అప్లికేషన్ వేశారు.


2020-21 ఆర్థిక సంవత్సరంలో కస్టమర్లు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్‌లను మెయింటైన్ చేయనందుకు బ్యాంకు వసూలు చేసిన ఛార్జీలు కేవలం రూ.170 కోట్లుగానే ఉన్నాయి. కానీ ఈ ఏడాది ఈ ఛార్జీలు భారీగా పెరిగాయి. 85,18,953 అకౌంట్ల నుంచి ఈ మొత్తాన్ని బ్యాంకు సేకరించిందని పీఎన్‌బీ తెలిపింది. మార్చి 31, 2022 నాటికి 6,76,37,918 అకౌంట్లు జీరో బ్యాలెన్స్ అకౌంట్లుగా ఉన్నట్టు బ్యాంకు తెలిపింది. 2018-19 నుంచి 2021-22 మధ్య కాలంలో పీఎన్‌బీలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి. 2019 మార్చి 31న పీఎన్‌బీలో జీరో బ్యాలెన్స్ అకౌంట్లు 2,82,03,379గా ఉంటే... 2021 మార్చి నాటికి ఈ అకౌంట్లు 5,94,96,731కు పెరిగాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com