ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ వెబ్ సైట్ హాల్ టికెట్లు

Education |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 12:53 PM
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌-2022 వచ్చే నెల 6న నిర్వహించనున్నట్లు సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణకుమార్‌ తెలిపారు. విద్యార్ధులు మే 28 నుంచి http: //tsrjdc. cgg. gov. in వెబ్‌సైట్‌లో ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కార్యదర్శి తెలిపారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జూన్‌ 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం గం. 12. 30 వరకు ప్రవేశ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com