ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు: 21-05-2022 శనివారం

Astrology |  Suryaa Desk  | Published : Sat, May 21, 2022, 11:40 AM

మేషం: సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.


వృషభం: ఆర్థిక వ్యవహారాలలో లోటుపాట్లుఉంటాయి. అనుకోని ప్రయాణాలు శ్రమను కలిగిస్తాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో శిరోభాదాలు తప్పవు. వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలొ కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


మిధునం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకున్న సమయానికి ధనం అందక రుణఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు స్వల్పముగా లాభిస్తాయి. నిరుద్యోగులు ప్రయత్నం మీద అవకాశములు అందుకుంటారు.


కర్కాటకం: నిరుద్యోగ అవకాశములు మెరుగుపడతాయి. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో నూతన బాధ్యతలు చేపడతారు.


సింహం: సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలలో కార్యజయం కలుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన వాహనయోగం ఉన్నది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.


కన్య: ప్రయాణాలలో తొందరపాటు మంచిది కాదు. అకారణంగా బంధువులతో తగాదాలు కలుగుతాయి. సంతాన అనారోగ్య విషయాలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కోపం అదుపులో ఉంచడం మంచిది.


తుల: కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. బంధు మిత్రుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.


వృశ్చికం: కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగములలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. స్ధిరాస్తి లాభం కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విహార యాత్రలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి.


ధనస్సు: నూతన రుణాలు ప్రయత్నాలు చేస్తారు. అధిక శ్రమతోకాని పనులు పూర్తి కావు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందక ఇబ్బంది కలుగుతుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. మిత్రుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. ఉద్యోగులకు అదనపు పనిభారం కలుగుతుంది.


మకరం: సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. కావలసిన బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీత భత్యముల విషయంలో శుభవార్తలు వింటారు.


కుంభం: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ధన పరంగా ఇబ్బంది కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.


మీనం: ఆర్ధిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. అవసరానికి అందరి సహాయం అందుతుంది. పాత మిత్రులతో కలిసి కొన్ని విషయాలు గూర్చి చర్చలు చేస్తారు. గృహనిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు ఉత్సహకరంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com