ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందానికి , ఆరోగ్యానికి క్యారెట్ జ్యూస్ తరచూ తాగండి

Recipes |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 10:00 PM

కారెట్లలో ఏ విటమిన్ ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. మెరుగైన కంటిచూపుకు విటమిన్ ఏ తప్పనిసరి గా తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, జుట్టుకి, కాలేయానికి చాలా మంచిది. హెయిర్ ప్రాబ్లెమ్స్ నివారించాలన్నా , మేనిఛాయ మెరిసిపోవాలన్నా, అల్సర్ వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలన్నా రోజుకొక క్యారెట్ ను తీసుకుంటూ ఉండాలి. లేకపోతే, వారానికి రెండుసార్లు క్యారెట్ జ్యూస్ ను తాగినా సరిపోతుంది. 


కావలసిన పదార్థాలు: క్యారెట్స్ - 4 , పంచదార - 2 కప్పులు, నిమ్మకాయ - 1, ఐస్ క్యూబ్స్ - 4


తయారీవిధానం : ముందుగా క్యారెట్ ను పైన తోలు తీసేసి చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక జ్యూసర్ లోకి తీసుకుని అందులో రెండు కప్పుల పంచదారను కూడా వేసి ఒక నిమిషం పాటు మిక్సీ పట్టాలి. ఆ తర్వాత అందులో 4 ఐస్ క్యూబ్స్ ను కొద్దిగా నీళ్లను పోసి, ఐదు నిమిషాల పాటు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడ కట్టుకుని క్యారెట్ రసాన్ని, పిప్పిని వేరు చెయ్యాలి. క్యారెట్ రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని పిండి గ్లాసులో పోసుకుని తాగితే చాలా రుచిగా ఉంటుంది. ఆఖరున యాడ్ చేసే నిమ్మకాయ వలన ఈ జ్యూస్ చాలా బావుంటుంది. మిగిలిపోయిన క్యారెట్ పిప్పిన పడెయ్యకుండా అందులో పాలు లేదా తేనెను కలిపి ముఖానికి రాసుకుంటే, ముఖం వెలిగిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com