ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్ కు బాసటగా పాకిస్తాన్ బిలీనియర్

international |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 09:18 PM

ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ప్రత్యేక సైనిక చర్య పేరుతో పొరుగు దేశంపై దండెత్తిన మాస్కో.. తన చర్యలను సమర్ధించుకుంటోంది. ఈ క్రమంలో ఘోరమైన యుద్ధ నేరాలకు పాల్పడుతోంది. ఉక్రెయిన్‌లో మానవహక్కుల హననానికి పాల్పడుతున్న రష్యాపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. కానీ, వీటిని క్రెమ్లిన్ ఏమాత్రం పట్టించుకోకుండా తమ దేశాన్ని రక్షించుకోడానికే యుద్ధం చేస్తున్నామని చెబుతోంది.


ఈ నేపథ్యంలో రష్యాతో తన శక్తికి మించి పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా సహా పశ్చిమ దేశాలు ఆయుధ సాయం చేస్తున్నాయి. తాజాగా, పాకిస్థాన్‌కు చెందిన బిలియనీర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసి ఉక్రెయిన్‌కు అందజేశారు. పాక్ బిలీనియర్, కీవ్ పోస్ట్ మాజీ పబ్లిషర్ మహ్మద్ జహూర్ రెండు యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన ఉక్రెయిన్‌కు ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన భార్య, ఉక్రెయిన్ సింగ్ కమలియా జహూర్ వెల్లడించినట్టు స్థానిక మీడియా తెలిపింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తన భర్త, ఆయన స్నేహితులు సాయం చేస్తున్నారని ఆమె చెప్పారు.


‘‘ఉక్రెయిన్‌కు రెండు యుద్ధ విమానాలను కొనుగోలు చేసి ఇచ్చిన విషయాన్ని వెల్లడించడానికి మహ్మద్ అనుమతించారు.. ఎందుకంటే ఆయన దీనిని రహస్యంగా ఉంచారు..’’ అని ఆమె పేర్కొన్నారు. కీవ్ పోస్ట్ దినపత్రిక మాజీ యజమాని అయిన మహ్మద్ జహూర్.. ఉక్రెయిన్‌‌‌పై రష్యా దండయాత్ర ప్రారంభమైన తర్వాత పలు విధాలుగా సహాయ సహకరాలు అందిస్తున్నారు. శరణార్థుల సురక్షిత తరలింపు సహా నిధులు సేకరణకు పాక్ సంతతికి చెందిన ఈ బ్రిటిష్ వ్యాపారవేత్త పలు కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, ఉక్రెయిన్లు సురక్షితంగా యుద్ధ భూమి నుంచి తరలివెళ్లేందుకు పలు దేశాల్లోని నేతలను కలిసి సాయం కోరారు.


మార్చిలో అరబ్ న్యూస్‌తో జహూర్ మాట్లాడుతూ.. రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు ప్రపంచం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ‘‘నేను బహిరంగంగా ఉక్రెయిన్ పక్షాన నిలబడతాను.. ఎందుకంటే పాశ్చాత్య, ఉక్రేనియన్, రష్యన్ మీడియాను చూసిన తర్వాత ఎవరు నిజం చెబుతున్నారో నేను అర్ధం చేసుకుని నిర్ణయించుకోగలను.. ఉక్రెయిన్ కోసం ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం ఇది.. పొరుగు దేశం దానిని మింగేస్తోంది’’అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com