ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిట్టకధను ఎడిట్ చెయ్యండి.. వైజయంతి మూవీస్ లో జాబ్ పట్టండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 03:42 PM

ఎవడే సుబ్రహ్మణ్యంతో టాలీవుడ్ కి పరిచయమైన క్రియేటివ్ దర్శకుడు నాగ్ అశ్విన్. 2018లో ఆయన డైరెక్ట్ చేసిన మహానటి చిత్రంతో జాతియగుర్తింపును సంపాదించాడు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ తో పాన్ వరల్డ్ మూవీ ప్రాజెక్ట్ కే ని చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. 


తాజాగా నాగ్ అశ్విన్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఉద్యోగ ప్రకటనను పోస్ట్ చేసాడు. ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కోసం తను డైరెక్ట్ చేసిన X-లైఫ్ ఎపిసోడ్ (పిట్టకథలు చిత్రం) ని డిఫరెంట్ గా ఎడిట్ చేసి ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ లో ఎడిటింగ్/ప్రోమో డిపార్టుమెంటు లో ఉద్యోగం సంపాదించండి ... అంటూ ట్వీట్ చేసాడు. ఎడిట్ చేసిన ఆ వీడియో చాలా ఆసక్తికరంగా, ప్రభావితం చేసేలా, ఉత్తమైనదిగా ఉండాలని నాగ్ అశ్విన్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఎవరైతే, ఎడిటింగ్ విభాగంలో రాణించాలనుకుంటున్నారో, వారికిది చాలా గొప్ప అవకాశం. ఇంకెందుకాలస్యం .. ఒక ప్రయత్నం చేసి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com