ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సర్జరీ విజయవంతం

international |  Suryaa Desk  | Published : Thu, May 19, 2022, 02:52 PM

పొత్తి కడుపులో నీటిని తొలగించే సర్జరీ ఆయనకు తాజాగా జరిగినట్టు సమాచారం. ఎటువంటి సమస్యల్లేకుండా ఆపరేషన్ విజయవంతంగా జరిగిందంటూ ఒక కథనం ప్రసారమైంది. రష్యా విదేశీ గూఢచార విభాగం జనరల్ కు చెందిన టెలిగ్రామ్ ఛానల్ సమాచారం ఈ కథనానికి నేపథ్యంగా ఉంది. ఈ నెల 12 లేదా 13 వ తేదీ పుతిన్ కు జరిగిన సర్జరీ క్యాన్సర్ సంబంధితం కాదని ఈ కథనం పేర్కొంది. ఈ సర్జరీ కారణంగానే ఆయన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనలేకపోయినట్టు సమాచారం. దీనికి బదులు సదరు సమావేశంలో ముందుగా రికార్డు చేసిన వీడియో సందేశాన్ని వినిపించారు. 'ఈ సర్జరీ ప్రక్రియ అన్నది రష్యా అధ్యక్షుడికి గతంలో సూచించిన సర్జరీ (క్యాన్సర్)కి సంబంధించినది కాదు. అది ఇంకా జరగాల్సి ఉంది' అని సదరు టెలిగ్రామ్ చానల్ లో పోస్ట్ ఉండడం గమనార్హం.


హైదరాబాద్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఒక సర్జరీ జరిగింది. పొత్తి కడుపులో నీటిని తొలగించే సర్జరీ ఆయనకు తాజాగా జరిగినట్టు సమాచారం. ఎటువంటి సమస్యల్లేకుండా ఆపరేషన్ విజయవంతంగా జరిగిందంటూ ఒక కథనం ప్రసారమైంది. రష్యా విదేశీ గూఢచార విభాగం జనరల్ కు చెందిన టెలిగ్రామ్ ఛానల్ సమాచారం ఈ కథనానికి నేపథ్యంగా ఉంది. ఈ నెల 12 లేదా 13 వ తేదీ పుతిన్ కు జరిగిన సర్జరీ క్యాన్సర్ సంబంధితం కాదని ఈ కథనం పేర్కొంది. ఈ సర్జరీ కారణంగానే ఆయన ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనలేకపోయినట్టు సమాచారం. దీనికి బదులు సదరు సమావేశంలో ముందుగా రికార్డు చేసిన వీడియో సందేశాన్ని వినిపించారు. 'ఈ సర్జరీ ప్రక్రియ అన్నది రష్యా అధ్యక్షుడికి గతంలో సూచించిన సర్జరీ (క్యాన్సర్)కి సంబంధించినది కాదు. అది ఇంకా జరగాల్సి ఉంది' అని సదరు టెలిగ్రామ్ చానల్ లో పోస్ట్ ఉండడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com