ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్​ లో త్వరలో మరిన్ని కొత్త ఫీచర్లు

Technology |  Suryaa Desk  | Published : Tue, May 17, 2022, 04:01 PM

వాట్సాప్​ లో త్వరలో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం మనం ఏదైనా గ్రూప్​ నుంచి లెఫ్ట్ అయితే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ ఆ విషయం తెలుస్తుంది. మనం గ్రూప్ నుంచి వెళ్లిపోయినట్లు చిన్న టెక్ట్స్ లైన్​ కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాట్సాప్​ కొత్త ఫీచర్​ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ వల్ల మనం గ్రూప్ నుంచి లెఫ్ట్ అయితే అడ్మిన్​ కు తప్ప గ్రూప్​లో ఉన్న సభ్యులెవరికీ ఆ విషయం తెలియదు. మనం లెఫ్ట్ అయినట్లు ఎలాంటి టెక్స్ట్ కూడా కనిపించదు. దీంతో మనం ఇష్టం లేని గ్రూప్​ల నుంచి సైలెంట్​ గా లెఫ్ట్ అవ్వొచ్చు. ఈ ఫీచర్​ ను ప్రస్తుతం వాట్సాప్ వెబ్​ లో పరీక్షిస్తున్నారు. మరో 2 నెలల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం వాట్సాప్​ స్టేటస్ ​లో ఏదైనా వెబ్​ సైట్ లింక్ షేర్ చేస్తే అది సాధారణ టెక్స్ట్​లానే కన్పిస్తుంది. ఇప్పుడు రాబోతున్న కొత్తగా అప్ డేట్ ​లో ఎవరైనా స్టేటస్​ లో లింక్ షేర్​ చేస్తే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో​ ప్రివ్యూ కనిపించనుంది. అంటే లింక్​ సంబంధించి ఫొటోతో పాటు వెబ్​సైట్ వివరాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్లలో స్టేటస్ ​లో షేర్​ చేసిన లింక్ క్లిక్​ చేస్తే కొంత సమాచారం మాత్రమే తెలుస్తోంది. కొత్త ఫీచర్ ​లో ప్రివ్యూ ద్వారా ఎక్కువ వివరాలు తెలుస్తాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com