ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్ : సన్‌రైజర్స్ పై కోల్‌కతా గెలుపు

sports |  Suryaa Desk  | Published : Sun, May 15, 2022, 12:16 AM

కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో శనివారం జరిగిన పోరులో ప్రత్యర్థి ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతాకు ఆరంభం కలిసిరాలేదు. 17 పరుగులకే వెంకటేశ్ అయ్యర్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో కలిసి అజింక్య రహానే ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే, ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 48 పరుగులు జోడించాక 26 పరుగులు చేసిన నితీశ్ రాణా అవుటయ్యాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఒవెర్స్ లో 8 వికెట్స్ నష్టానికి 123 పరుగులు చేసింది. దానితో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కోల్‌కతా గెలుపొందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com